ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండంటంతో నాయకులతో పాటు ,సినీ ప్రముఖులు కూడా వారికి నచ్చిన పార్టీలలో చేరుతున్నారు. భారతదేశంలో రాజకీయలకు,సినిమాలకు విడదీయరాని బంధం ఉన్న సంగతి తెలిసిందే. కొందరు నటులు పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కూడా పని చేసిన చరిత్ర ఇండియాకే దక్కుతుంది. తాజాగా ఎన్నికలు దగ్గరకు రావడంతో వివిధ పార్టీలలో చేరడానికి సినిమా వాళ్లు రెడీ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ బీజేపీ పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఇషా కొప్పికర్ బీజేపీలో చేరారు.
ఆమె అలా పార్టీలో చేరిందో లేదో ఆమెకు పార్టీ పదవిని అప్పగించారు.ఇషా కొప్పికర్‌ను బీజేపీ విమెన్ ట్రాన్స్ పోర్ట్ వింగ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. 2002లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ సినిమాతో నటిగా వెండితెరకు పరిచియం అయింది ఇషా కొప్పికర్. బాలీవుడ్‌తో పాటు తెలుగు సినిమాలలో కూడా నటించింది ఇషా కొప్పికర్. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో కనిపించి మెప్పించింది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన టిమ్మీ నారంగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ భామ. వీరికి అయిదేళ్ల పాప కూడా ఉంది.
- Advertisement -
రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -