టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుపై ఎఫ్ 2 సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశంసలు వర్షం కురిపించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. థియేటర్స్ లో నాన్ స్టాప్ నవ్వులు కురిపిస్తోన్న ఈ సినిమా, బయ్యర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి కెరియర్లోనే ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతు … నేను ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను .. ఆయనే మహేశ్ బాబు. సినిమా మొదటి నుంచి నాకు ఎంతో మద్దతునిచ్చారు మహేశ్. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మహేశ్ బాబు గారు చేసిన ప్రతి ట్వీట్ కిక్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ కాగానే చూసి అభినందించారు. ఆయన ఇలా భుజం తట్టి ప్రోత్సహించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దీంతో మహేశ్‌తో అనిల్ రావిపూడి త్వరలోనే ఓ సినిమా చేయనున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
- Advertisement -
మహేశ్ బాబు మంచి కిక్ ఇచ్చారు – అనిల్ రావిపూడి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -