- Advertisement -

ఏం గుండె సార్‌ మీది..అనిల్ నవ్వులే నవ్వులు!

- Advertisement -

నందమూరి బాలకృష్ణకు ఇటీవలె కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరి ఓ పార్టీ ఇచ్చారు. ఈ విందుకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి అందరి చేత నవ్వులు పూయించారు.

నారా లోకేష్ బాబు కట్టుకున్న భార్య ముందు అమ్మ వంట గొప్పది అని చెప్పారు. ఏం గుండె సార్ మీది. బాలయ్య గారిని వసుంధర గారి ముందు ఐ లవ్ యు చెప్పమంటే ఎవరికి చెప్పాలి అని అడిగారు ఏం గుండె బాబు మీది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మేము ఓ రేంజ్ లో చూస్తాము. ఆయన్ని భువనమ్మ గారు పై నుంచి ఏమండీ ఒకసారి పైకి రండి అంటే ఆయన అలా సామాన్యుడిలా పైకి వచ్చారు అన్నారు.

అంతేగాదు భువనమ్మ టైం లిమిట్ ఇచ్చారు ఇది రాజకీయ సభ కాదు అయిదు నిమిషాలే మాట్లాడాలి అని ఈ ఇన్సిడెంట్ చూసాక నేను, బాబీ అనుకున్నాము మేము భార్యలతో రాలేదు బతికిపోయాం అని సరదాగా అన్నాడు. దీంతో అంతా పడిపడి నవ్వుకున్నారు.

https://twitter.com/bullii_raju/status/1886566625924800923

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -