ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు చాలానే సినిమాలు విడుదల అయ్యాయి. కాని విజయం సాధించింది మాత్రం ఎఫ్ 2 సినిమా మాత్రమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఈ సినిమా. వెంకీ , వరుణ్‌లు హీరోలుగా నటించగా, తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఇటీవలే ఈ సినిమా యాభై రోజులను కూడా పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా 140 కోట్లు సాధించిందని చిత్ర యూనిట్ అధికారంగా ప్రకటించింది.
తాజాగా ఈ సినిమా నుంచి తొలగించిన కొన్ని సీన్లను యూట్యూబ్‌లో విడుదల చేశారు చిత్ర నిర్మాత దిల్ రాజు.వెంకీ, మెహ్రీన్ మధ్య నడిచే ఈ కామెడీ సీన్ ఆకట్టుకుంటోంది. సినిమాలో గనుక ఈ సీన్ ఉండి ఉంటే.. ఆడియన్స్ మరింత నవ్వుకునేవారు. ఎఫ్ 2 సినిమా ఘనవిజయం సాధించడంతో , ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సంబంధించి ఓ కథను కూడా రెడీ చేస్తున్నాడట అనిల్ రావిపూడి.
- Advertisement -
‘F2’ డిలీట్ చేసిన సీన్స్ విడుదల .. అన్ని మసాలా సీన్లే(వీడియో)
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -