Thursday, May 16, 2024
- Advertisement -

టీజ‌ర్ నిండా ప‌చ్చి బుతులే..!

- Advertisement -

తెలుగు సినిమాలో బుతు క‌థ‌లు ఎక్కువుగా వ‌స్తున్నాయని ఎప్ప‌టి నుంచో వినిపిస్తోన్న మాట‌. తెలుగు సినిమా స్థితిని గ‌తిని మార్చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఏ మూహుర్త‌న ఈ సినిమాను తీశారో గాని దీనిని ప్రేర‌ణ‌గా తీసుకుని చాలానే సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలో బుతులు ఉన్న‌ప్ప‌టికి కథ‌లో ద‌మ్ము ఉండంటంతో అర్జున్ రెడ్డి సినిమా ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా త‌రువాత బుతు సినిమాలు ఎక్కువుగా తెర‌కెక్కుతున్నాయి. ముఖ్యంగా శృంగార భ‌రిత సినిమాలు తెలుగులో ఎక్కువుగా వ‌స్తున్నాయి. తాజాగా మ‌రో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. ఫలక్ నుమా అనే సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ఈ నగరానికి ఏమైంది ఫెమ్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా శృంగారాన్ని బేస్ చేసుకుని తీసిన‌ సినిమా కాద‌ని టీజ‌ర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది. కాని ఈ టీజ‌ర్‌కు సెన్సార్ వారు యూట్యూబ్‌కు ఎలా ప‌రిమిష‌న్ ఇచ్చారో అర్ధం కావ‌డం లేదు. టీజ‌ర్ నిండా ప‌చ్చి బుతుల‌తో నింపేశారు. పచ్చి బూతుల‌లో కూడా హార్డ్ రొమాంటిక్ లిప్ లాక్స్ గట్టిగానే తగిలించారు. పెళ్లి చూపులు ద‌ర్శ‌కుడు తరుణ్ భాస్కర్ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ రోల్లో క‌నిపించాడు. టీజ‌ర్ అయితే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మ‌రి సినిమా విడుద‌ల త‌రువాత ఎలాంటి ఫ‌లితాన్నిఅందుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -