Friday, May 17, 2024
- Advertisement -

అక్షయ్ ను మించిన షారూక్

- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రం రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. 2016 సంవత్సరంలో తొలి వీకెండ్ లో ఏకంగా 52.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఫ్యాన్ సినిమా.

అంతకు ముందు ఈ రికార్డు అక్షయ్ కుమార్ నటించిన ఎయిర్ లిఫ్ట్ చిత్రానిది. ఫ్యాన్ చిత్రం విడుదలైన తొలి మూడు రోజుల్లోనే 52 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఓ హీరోకి.. అతని అభిమానికి మధ్య జరిగే కథనే ఫ్యాన్ పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ హీరోగానూ, అతని అభిమానిగానూ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా రికార్డులకు షారూక్ ఖాన్ మహదానందంగా ఉన్నాడు.

2015లో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయ్ జాన్ సినిమా 102 కోట్లతో సునామి తీసుకువస్తే, ఆ సంవత్సరం రెండో స్ధానంలో అమీర్ ఖాన్ నటించిన పికె నిలిచింది. ఆ సినిమా 95.21 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మొదటి స్ధానం ఫ్యాన్ సినిమాకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -