సెప్టెంబర్ రెండు అనగా రేపు పవన్ కల్యాణ్ అభిమానులకు పెద్ద పండగ. తమ అభిమాన హీరో పుట్టిన రోజు. మరి అంతకు మించి అభిమానులకు వేరే పండగ ఉండదు. సెలబ్రేషన్స్ ను పీక్ స్టేజీకి తీసుకెళ్లడానికి ఇంతకు మించిన సందర్భం కూడా అక్కర్లేదు.
అయితే ఈ సారి మాత్రం పవన్ కల్యాణ్ అభిమానులు కొత్తరకంగా సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజును కొత్తర కంగా సెలబ్రేట్ చేస్తున్నారు.
చెట్లను నాటడం ద్వారా వారు తమ అభిమాన హీరో పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ లో కొత్తరకంగా పిలుపు వినిపిస్తోంది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా చెట్లను నాటాలనేది ఈ పిలుపు సారాంశం. ప్రతి ఒక్క అభిమానీ ఒక్కో చెట్టును నాటి దానితో సెల్ఫీ దిగాలని అభిమానులు ఒకరిని మరొకరు పిలుపునిచ్చుకొన్నారు.
plant a tree… and take a selfie అంటూ పవన్ అభిమానులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సెప్టెంబర్ రెండో తేదీన పవన్ పై అభిమానాన్ని చాటుకోవాలని వారు భావిస్తున్నారు. మరి చెట్లను నాటడం అంటే అది మంచి పనే! మరి నిజమైన పవన్ అభిమానులు రేపు మొక్కల నాటకంతో సెల్ఫీలను దిగుతారు! ఆ విధంగా పర్యావరణ పరిరక్షణ కు పాల్పడతారు.