Monday, April 29, 2024
- Advertisement -

నాకు భర్త లేడని ఇలా చేస్తావా : వరుణ్ పై శివజ్యోతి ఫైర్

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ కి రోజులు దగ్గర పడటంతో ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం ఎక్కువ అవుతుంది. టాపర్ ఆఫ్ ది టాస్క్ లో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. రాహుల్, శ్రీముఖి, శివజ్యోతి, వరుణ్ సందేశ్ ల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో.. బాబా బాస్కర్ ను వితిక, శివజ్యోతి ఇద్దరూ టార్గెట్ చేశారు. ఇక ఇంటి సభ్యులు ఎందుకు అర్హులో నిరూపించుకోవాలంటూ నిబంధనలు పెట్టారు. హౌస్ బయట ర్యాంకు బోర్డులు పెట్టి.. కొన్ని చీటీలు పెట్టారు.

చీటిని తీస్తే వచ్చే ర్యాంకు తనకు సరికాదు అనుకుంటే.. దానిని మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక వేళ తన ర్యాంకు వేరే వారికి వస్తే దానికి తాను ఎందుకు అర్హుడిననే విశయాన్ని చెప్పాలి. చీటీల ప్రకారం బాబా భాస్కర్ కు ఒకటో నెంబర్, రాహుల్‌కు రెండో ర్యాంకు, వరుణ్ సందేశ్‌కు మూడో నంబర్, 4వ స్థానంలో అలీ రెజా, 5వ స్థానంలో శివజ్యోతి, 6వ స్థానంలో వితిక, 7 స్థానంలో శ్రీముఖి నిలిచారు. ఇక ప్రతి హౌస్ సభ్యులు తమ క్రెడిట్స్ ను చెప్తూ స్థానాలను మార్చుకోవాలని చూశారు.

వితక కోసం వరుణ్ తన మూడో స్థానాన్ని ఇవ్వడం పెద్ద గొడవకు దారి తీసింది. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. శివజ్యోతి, వరుణ్ మధ్య గొడవ జరిగింది. నీ భార్య కాబట్టి ర్యాంకు మార్చుకోవడం కరెక్ట్ కాదు. నా భర్త ఇప్పుడు లేడు. నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అని శివజ్యోతి అంటే.. నీకంటే వితిక బెటర్ అందుకే ఆమెకి మూడో స్థానం ఇస్తాను. అలాగే నేను రాహుల్ కంటే బెటర్ కాబట్టి రెండో స్థానంకు వెళ్తాను అని వరుణ్ అన్నాడు.

వితిక భార్య కాబట్టి మూడో స్థానం ఇవ్వడం ఎంత మాత్రం కూడా సరికాదని శివజ్యోతి చెప్పింది. వితికకంటే నేను మంచి కంటెస్టెంట్ అని శివజ్యోతి అంటే.. కపుల్ కంటెస్టెంట్ గా వచ్చామంటే అందుకు మాకు ఉన్న క్రెడిబిలిటి అని వరుణ్ వాదించాడు. వితిక, వరుణ్ లతో శివజ్యోతి దాదాపు 20 నిమిషాలపాటు వాదించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -