Monday, May 6, 2024
- Advertisement -

రజినీ కాంత్ ‘దర్బార్’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల…

- Advertisement -

పేట’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేకసిన రజినీ కాంత్ 161వ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్‌తో రజినీకాంత్ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసింది. సెట్స్ పైకి వెళ్ళేoదుకు చాలా టైం పట్టింది. నేటి నుంచి చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్‌ ఏర్పాటు చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను మంగళవారం ప్రకటించారు. ‘దర్బార్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఈ చిత్రానికి పెట్టారు.

రజిని వెనుక తుపాకులు, బెల్ట్, బేడీలు కనిపిస్తున్నాయి. రెండు నెల‌లో చిత్రాన్ని పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ట‌. న‌య‌న‌తార చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ‌రోసారి ర‌జ‌నీకాంత్ చిత్రానికి స్వ‌రాలు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ సినిమా లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజినీ ర‌జ‌నీకాంత్ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారనేది తెలుస్తోంది. వీటన్నికంటే ముఖ్యంగా పోస్టర్‌పై ఇంగ్లిష్‌లో రాసిన ‘నన్ను మంచివాడిగా చూడాలనుకుంటున్నారో లేదంటే చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి’ అనే వాక్యం సినిమాపై ఆసక్తిని రేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -