Tuesday, April 23, 2024
- Advertisement -

సానియా మీర్జా బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా..?

- Advertisement -

ప్ర‌స్తుతం ఇండియాన్ సినిమాల‌లో బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. బాలీవుడ్‌లో మొద‌లైన ఈ బ‌యోపిక్‌లు ప్ర‌స్తుతం అన్ని భాష‌ల‌కు పాకింది. తెలుగులో కూడా ఈ బ‌యోపిక్‌ల హ‌వా సాగుతుంది. ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ బ‌యోపిక్‌లు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో బ‌యోపిక్‌కు రంగం సిద్దం అవుతుంది. ఇప్ప‌టికే ధోని, స‌చిన్ వంటి క్రీడకారులు జీవితల‌ను సినిమాలుగా చూపించారు. సైనానేహ్వాల్ జీవిత క‌థ కూడా సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పుడు మ‌రో క్రీడకారిణీ జీవితాన్ని కూడా వెండితెర మీద‌కు చూపించ‌బోతున్నారు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్ కూడా తెరపైకి రానుంది.

ఆమె బ‌యోపిక్‌పై చాలా రోజులు నుంచి వార్త‌లు వ‌స్తున్నప్ప‌టికి దీనిపై ఎవ‌రు స్పందించలేదు. తాజాగా త‌న బ‌యోపిక్‌పై స్పందించింది సానియా మీర్జా. చాలా కాలంగా తన బయోపిక్ పై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికి కుదిరిందని చెప్పింది. బయోపిక్ కి సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేసినట్లు సానియా మీర్జా శుక్రవారం నాడు వెల్లడింది. అయితే ఆమె పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారో మాత్రం తెలియాల్సి ఉంది. ఈ బ‌యోపిక్‌కు బాలీవుడ్ దర్శకనిర్మాత రోనీ స్క్రూవాలా రూపొందించనున్నారు.త్వ‌ర‌లోనే సినిమాలో ఎవ‌రో న‌టిస్తారో చెబుతామ‌ని అంటుంది సానియా. పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయాబ్ మాలీక్‌ను పెళ్లాడింది సానియా. ఇటీవ‌లే సానియా మీర్జాకు ఇటీవ‌లే ఓ బాబు కూడా పుట్టడం జ‌రిగింది.

https://www.youtube.com/watch?v=jQ5snMST7js

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -