Wednesday, May 15, 2024
- Advertisement -

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 4 రోజుల కలెక్షన్లు చూస్తే షాకే!

- Advertisement -
gautamiputra satakarni 4 days collections report

బాలకృష్ణ కేరీర్ లో ప్రతిష్టాత్మక తెరకెక్కిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని రెంజ్ లో విజయం అందుకుంది. బాలకృష్ణ మార్కెట్ కంటే ఎక్కువే కలెక్షన్స్ వస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ఫస్ట్ వీకెండ్ (4 రోజుల)లో రూ.25.93 కోట్లు కొల్లగొట్టింది. ఇది బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్ ఫిగర్. ఆయన గత సినిమాల్లో ఏ ఒక్కటీ ఇంత తక్కువ టైంలో అంతమొత్తం వసూళ్లు రాబట్టలేదు. ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విజువల్ వండర్‌ని కేవలం 79 రోజుల్లోనే దర్శకుడు క్రిష్ పూర్తి చేశాడు.

ఇక ‘శాతకర్ణి’ పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక బాలయ్య సరసన శ్రియా శరన్ హీరోయిన్ గా నటించగా.. ప్రధాన పాత్రలో హేమమాలిని కనిపించింది. ఇక ఈ సినిమా 4 రోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)

సీడెడ్ : 5.37

గుంటూరు : 3.07

ఉత్తరాంధ్ర : 2.66

వెస్ట్ గోదావరి : 2.42

ఈస్ట్ గోదావరి : 2.15

కృష్ణా : 2.03

నెల్లూరు : 1.24

టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 25.93 కోట్లు (షేర్)

Related

  1. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్
  2. గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ!
  3. శాతకర్ణి సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  4. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -