కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఏం చేసిన సంచలనమే.శింబు ఒకేసారి మూడు సినిమాలను చేస్తున్నట్లు ప్రకటించాడు..శింబు గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.సినిమా ఒప్పుకోవడం కాదు,షూటింగ్‌లకు సరైన సమయానికి రావటం నేర్చుకోమంటూ చాలా మంది కామెంట్ చేశారు. అయితే ఈ విమర్శలపై స్పంచిందిన శింబు డియాకు శింబు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు.
నా తొలి సినిమా చేసినప్పుడు కూడా మా నాన్నతో కలిసి 10 గంటలకు సెట్‌కు వెళ్లాను. రోబోలా జీవించటం నా వల్ల కాదు. నాకు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. నా జీవితాన్ని నేను ఆనందంగా జీవించగలను. సినిమా అంటే ఇష్టం అందుకే ఈ రంగంలో కొనసాగుతున్నాను. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమిచండి నా ప్రవర్తనను మార్చుకుంటాను అని క్లారిటీ ఇచ్చారు శింబు.
ఒక్కప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్‌గా ఓ వెలుగు వెలిగిన శింబు ఇప్పుడు సరైన హిట్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు.హీరోయిన్ నయనతారని ప్రేమించాడు శింబు. ఆ మధ్య వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి.అయితే శింబు బిహేవియర్ నచ్చక నయనతార శింబు నుండి విడపోయిన సంగతి తెలిసిందే.