Sunday, May 11, 2025
- Advertisement -

గీతా మాధురి ఎలిమినేష‌న్‌లో ఉంటే బ‌య‌టికి వ‌చ్చేదా?

- Advertisement -

సింగ‌ర్ గీతా మాధురి బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. షో మొద‌ట్లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంది గీతా. బిగ్‌బాస్ హౌస్ట్ అయిన నాని కూడా గీతా మాధురిని చాలాసార్లు అభినందించారు. అయితే స‌డ‌న్‌గా గ‌త మూడు వారాలుగా గీతాలో చాలా మార్పు వ‌చ్చింద‌ని అంటున్నారు బిగ్‌బాస్ ప్రేక్ష‌కులు. సామ్రాట్‌తో ఆమె న‌డిపిన వ్య‌వ‌హారం కాని ,కౌశ‌ల్‌తో ఆమె ప్ర‌వ‌ర్తిస్తున్నా తీరుతో కాని , గీతాపై వ్య‌తిరేక‌త ఎక్కువైందని తెలుస్తుంది. తాజాగా ఆమె చేసే ఓవ‌ర్ యాక్ష‌న్‌ను చూడలేక‌పోతున్నారు బిగ్‌బాస్ ప్రేక్ష‌కులు.

రెండు రోజులు క్రితం ఇచ్చిన కారు రివర్స్ గేమ్‌లో ఆమె ప్ర‌వ‌ర్తించిన తీరు చాలా జుగుప్సాక‌రంగా ఉంది. ఆ గేమ్‌లో విజ‌యం సాధించిన గీతా టీం, ఓడిపోయిన కౌశ‌ల్ ద‌గ్గ‌రికి వెళ్లి ఏగ‌తాళి చేయ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు. ఇక గీతా కౌశ‌ల్ గురించి అడిగిన,అడ‌గ‌క పోయిన అంద‌రితో చ‌ర్చించి కౌశ‌ల్ ఒక బ్యాడ్ పర్సెన్‌లా చిత్రిక‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అదే గీతా ఎలిమినేష‌న్‌లో ఉంటే క‌నుక బ‌య‌టికి వ‌చ్చేద‌ని కామెంట్స్ చేస్తున్నారు. బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ ఆర్మీ గీతాపై తీవ్ర కోపంతో ఉన్నారు. ఆమె ఎప్పుడు ఎలిమినేష‌న్ వ‌స్తుందా అని కౌశ‌ల్ ఆర్మీ ఎదురు చూస్తుంది. మ‌రి ఇప్ప‌టికైనా గీతా త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -