- Advertisement -

సిద్ధూ మరో హిట్ కొట్టాడు!

- Advertisement -

సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తెలుసు కదా. సిద్ధు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి షెట్టి నటించారు. సోషల్ మీడియాలో ఈ చిత్రం ఒక ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామాగా పేరు తెచ్చుకుంది. ఇక ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంతో సిద్దూ మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు.

హృదయాన్ని కదిలించే ఎమోషన్స్, బలమైన కెమిస్ట్రీ, కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుసు కదా ఒక ఫీల్-గుడ్ లవ్ స్టోరి… సిద్ధు కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ డెలివరీ లెవల్ అద్భుతంగా ఉందని… రాశి , శ్రీనిధి సినిమాకు గ్లామర్ తీసుకొచ్చారని తెలిపారు. ఈ వీకెండ్ ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుందని చెప్పారు నెటిజన్లు.

సిద్ధు లవర్ బాయ్ మరియు గ్రే షేడ్ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించాడు అని దర్శకురాలిగా నీరజ కోన తొలిప్రయత్నంలో సక్సెస్ అయ్యారని కామెంట్ చేస్తున్నారు. కథనం మరియు భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిస్తున్నారు. కనిపిస్తున్నాయి.”

సినిమా కథ ఒక చెఫ్, మరియు అతని భార్య అంజలి చుట్టూ నడుస్తుంది. అంజలి తరువాతకు పిల్లలు కుడా పుట్టకపోవడం తెలుసుకుంటుంది. వీరు డాక్టర్ రాగ దగ్గర సురోగసీ సహాయం కోరతారు. ఈ ప్రక్రియలో అనుకోని సవాళ్లు మరియు భావోద్వేగాల మధ్య కథ సాగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -