టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుపై రెండు రోజులు క్రితం అనేక వార్తలు వచ్చాయి. గచ్చబౌలిలోని మహేశ్ మల్టీప్లెక్స్ ప్రేక్షకుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని జీఎస్టీ అధికారుల తనిఖిలలతో తేలడంతో ఈ వార్త సంచలనంగా మారింది. మహేశ్ బాబు వంటి స్టార్ హీరో ఇలా చేయడం ఏంటని అందరు అనుకున్నారు. అయితే మహేశ్ బాబుకు మల్టీప్లెక్స్ రంగంలోకి కొత్తగా దిగడం వల్ల ఈ పొరపాటు జరిగిందట. పైగా ఇది మహేశ్ ఒక్కరిదే కాకపోవడం, నిర్వహణ కార్యక్రమాలు వేరేవారు చూసుకోవడంతో ,ఈ మల్టీప్లెక్స్ గురించి పెద్దగా పట్టించకోవడం లేదట మహేశ్.
అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో రంగంలోకి దిగిన మహేశ్ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని తాము సినిమా ప్రేక్షకుల నుంచి జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.35.66 లక్షలను ‘వినియోగదారుల సంక్షేమనిధికి ఇచ్చేశాడట. దీనిపై జీఎస్‌టీ హైదరాబాద్ కమిషనరేట్ మహేశ్ బాబును ప్రశంసించింది. తమది కాని లాభాన్ని గుర్తించి, తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీఎస్టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని,మహేష్‌బాబు అందరికి ఆదర్శంగా నిలిచారని జీఎస్‌టీ అధికారులు తెలిపారు.
- Advertisement -
మహేశ్ బాబులా ఎవరు ఇలా చేయలేదు..శభాష్ – జీఎస్టీ అధికారులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -