Sunday, May 5, 2024
- Advertisement -

పద్ధతి మార్చుకున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరో

- Advertisement -

యువహీరో కార్తికేయ గుమ్మకొండ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించినప్పటికీ రెండవ సినిమా అయిన ‘హిప్పీ’ మాత్రం కార్తికేయ కి మంచి విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసిన కార్తికేయ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దాదాపు అన్ని వేడుకలలో షర్ట్ విప్పేసి తన సిక్స్ ప్యాక్ ని అందరికీ పలుసార్లు చూపించాడు. ఇలాంటివి ఎన్ని ఫీట్లు చేసినప్పటికీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో కార్తికేయ తన పద్ధతి మార్చుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘గుణ 369’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కార్తికేయ పద్దతి మార్చి షర్ట్, లుంగీలో కనబడడం అందరినీ షాక్ కి గురి చేశాడు. నిన్న మొన్నటిదాకా షర్ట్ విప్పి తిరిగిన కార్తికేయ ఇప్పుడు సడన్ గా ట్రెడిషనల్ అవతారంలో కనిపించేసరికి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈసారి మాత్రం సినిమా విషయంలో ఎలాంటి హడావిడి చేయకుండా సినిమాని చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనాఘ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -