Thursday, May 16, 2024
- Advertisement -

గుణశేఖర్ కి మోక్షం కలిగేదెప్పుడో…

- Advertisement -

రుద్రమదేవి సినిమా తర్వాత రానా తో ప్రతాపరుద్రుడు అనే సినిమా చేయాలనీ అనుకున్నాడు రానా అయితే ఏం అయిందో ఏమో కానీ ఇద్దరూ మనసు మార్చుకొని హిరణ్యకశ్యపుని కథ ని సినిమా గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గుణశేఖర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టి మూడు సంవత్సరాలు సమయం తీసుకొని అంతా సమకూర్చుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన ఇటీవలే సోషల్ మీడియా లో కూడా తెలిపారు. కాగా ఇప్పుడు అందరికీ అంతు చిక్కని అంశం ఏంటి అంటే ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అని.

ఇప్పటికే గుణశేఖర్ చాలా ఏళ్ళు ఎదురు చూసాడు అని, రానా నే డేట్స్ ఇవ్వలేదు అని, సినిమా సంవత్సరం చివరికి కానీ మొదలు కాదు అని కొందరు అంటున్నారు కాకపోతే రానా మరియు అతని సన్నిహిత వర్గాలలు మాత్రం అలాంటిదేమి లేదు, సమయం వచ్చినప్పుడు అన్ని పనులు జరిగిపోతాయి అని అంటున్నారు.

అయితే ఈ విషయం పైన మరొక వాదన ఏంటి అంటే, రానా ఈ రోజు షూటింగ్ కి రెడీ అని చెప్పినా ఒకే అనే పొజిషన్ లో ఉన్నాడు కానీ గుణశేఖర్ సైడ్ నుండి ఇంకా క్లారిటీ లేదు అని కొంత మంది చెప్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కావాలని, ఈ కాంబినేషన్ నుంచి ఒక విజువల్ వన్దర్ ని త్వరలో చూడాలి అని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -