Sunday, May 4, 2025
- Advertisement -

దర్శకుడు గుణశేఖర్ నిర్ణయం

- Advertisement -

గుణశేఖర్. తెలుగు చలన చిత్రసీమలో భారీ దర్శకుడు. చిరంజీవితో చూడాలని ఉంది, ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక్కడు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసిన గుణశేఖర్ తాజాగా రుద్రమదేవి చిత్రం తీసి మరో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో 50 కోట్లు వసూలు చేసిన రికార్డులకెక్కాడు. ఆ చిత్రం తర్వాత దానికి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు చిత్రం తీయాలని ప్లాన్ చేశాడు.

అయితే ఈ సినిమాలో భారీ తారాగణం నటించాలి. కాని వారంతా బిజీగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు గుణ శేఖర్. ఈ గ్యాప్ లో ఏం చేయాలా అని ఆలోచించి కొత్త వారితో ఓ చిన్న సినిమా తీస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చాడట. ప్రస్తుతానికి ఆ చిన్న సినిమా కథలో పడ్డాడు గుణశేఖర్. ఈ చిత్రానికి కథ రచన పూర్తి అయితే నటీనటుల ఎంపిక, నిర్మాణం వంటివి ప్రారంభిస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు గుణశేఖర్.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -