సమంత ‘శాకుంతలం’ ట్రైలర్!

Samantha Shaakuntalam Movie Trailer Released
Samantha Shaakuntalam Movie Trailer Released

హీరోయిన్ సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్స్‌పై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత శాకుంతలగా కనిపిస్తే..మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా భరతుడి పాత్రలో కనిపించబోతోంది.

శాకుంతలం సినిమా నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శకుంతల – దుష్యంతుల మధ్య పరిచయం .. ప్రేమ .. వివాహం .. విరహం .. వియోగం .. శకుంతల గర్భాన్ని ధరించడం వంటి అంశాలను టచ్ చేస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. అద్భుతమైన దృశ్య కావ్యంగా ఈ సినిమాను మలిచారనే విషయం విజువల్స్ ను బట్టి అర్థమవుతోంది.