Thursday, May 2, 2024
- Advertisement -

హను కథ ని దేవరకొండ ఒకే చేస్తాడా?

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో అగ్రగామి గా వెలుగొందుతున్న నటుల్లో ఒకరు. ఈ నటుడు ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా లో నటించి, ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేస్తున్న విజయ్ తో పని చేయాలని ఇప్పటికే చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. అయితే హను రాఘవపూడి కూడా అందులో ఒకరు. ప్రేమ కథా చిత్రాలని తెరకెక్కించడం లో తనదైన ముద్ర ని వేసిన ఈ దర్శకుడు విజయ్ కోసం ఒక ప్రేమ కథ ని సిద్ధం చేసాడట.

పడి పడి లేచే మనసు చిత్రం ద్వారా అందరి మన్ననలు పొందిన దర్శకుడు సినిమా ని బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం గా మలచడం లో విఫలమయ్యాడు. అయితే హను ప్రతిభ మీద విజయ్ కి నమ్మకం ఉంది అంట. హిట్ ఫ్లాప్ల తో సంబంధం లేకుండా దర్శకులకి అవకాశాలు ఇవ్వడం లో ఎప్పుడూ ముందు ఉండే విజయ్ ఇప్పటికే రెండు మూడు సార్లు హను తో స్క్రిప్ట్ డిస్కషన్ చేసాడట. తనకి అనిపించినా కొన్ని సూచనలు చేసి మళ్ళి రమ్మని హను కి చెప్పాడట.

అయితే చివరికి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుంది అనేది మనం వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -