ఇటీవల కాలంలో బాలీవుడ్ నటీ,నటులు ఎఫైర్లు పెట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే పలువురు ఇలాంటి పద్దతిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సెక్సీ బాంబ్ మలైకా ఆరోరా భర్తకు విడాకులు ఇచ్చి యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ఎఫైర్ నడుపుతోంది. తాజాగా మరో జంట తమ ఎఫైర్ గురించి పబ్లిక్‌గానే ఓప్పుకున్నారు. ఖడ్గం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైంది కిమ్ శర్మ.
సినిమా హిట్ అయినప్పటికి కిమ్ శర్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా సేమ్ సీన్ రీపిట్ కావడంతో చేసేది లేక పెళ్లి చేసుకుంది. ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లాడింది కిమ్‌శర్మ. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని సడన్‌గా అతనికి విడాకులు ఇచ్చి , టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమయాణం మొదలుపెట్టింది. పబ్‌లు,రెస్టారెంట్లు,అంటూ తెగ తిరిగేశారు. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. దీంతో వీరి ఎఫైర్ గురించి రకారకాల వార్తలు బయటికి వచ్చాయి.
ఇప్పటి వరకు వీరి రిలేషన్‌షిప్ గురించి ఎవరు స్పందించలేదు. తాజాగా హర్షవర్ధన్ రాణే ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు అవును తామిద్దరం రిలేషన్‌షిప్ ఉన్నామంటూ.. ఇందులో దాయడానికి ఏమి లేదు. తన మంచి కోరుకునేవాడిని కాబట్టి ఇన్ని రోజులు ఈ విషయం గురించి స్పందించలేదని హర్ష జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ