- Advertisement -
’రకుల్ ప్రీత్ సింగ్’ టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈ అమ్మడు అనతికాలంలోనే అగ్ర కథానాయికల చేరువలో చేరింది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేసిన రకుల్, ఆ తరువాత అందరి అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. హీరోయిన్లందరూ ఈమె ఎదుగుదలను చూసి అసూయ పడే స్థాయికి చేరుకుంది.
ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఒక విషయం చెప్పడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. అదేంటంటే రకుల్ ఫాదర్ ఈ అమ్మడును పిచ్చ కొట్టుడు కొట్టాడట. ఎందుకంటే ఈమె పబ్‌లకు పార్టీలకు వెళ్ళడం వాళ్ళ నాన్నకు ఇష్టం లేదట. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆయన కోపంతో పిచ్చి, పిచ్చిగా కొట్టేశాడట… ఈ విషయం తానే స్వయంగా ఒక కరాటే-కిక్ బాక్సింగ్ ఫంక్షన్‌లో చెప్పింది..
బహుశా అందుకేనేమో ఈ అమ్మడు పబ్బుల్లో తక్కువగా కనిపిస్తోంది..!