కన్నబిడ్డల్ని చంపిన తండ్రి

కుటుంబాల్లో గొడవలు చాలా సాధారణం. కానీ, ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే జీవితాలే నాశనమౌతాయి. ఇక్కడ భార్య మీద కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపి తానూ అంతమయ్యాడో వ్యక్తి. మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

మహబూబాబాద్ జిల్లా గడ్డి గూడెం తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ రామ్‌ కుమార్‌. రామ్‌ కుమార్, శిరీష 9 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరేళ్ల పాప, నాలుగేళ్ల బాబు ఉన్నారు. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌కుమార్‌ సెలవు మీద 4 రోజుల క్రితం కుటుంబంతో కలిసి గడ్డిగూడెం తండాకు వచ్చాడు. అయితే, ఏడాది కాలంగా ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వని రామ్‌ కుమార్‌, భార్య బంగారం కూడా తాకట్టు పెట్టాడు. దానిమీద ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీనిపై జరిగిన గొడవలో భార్యను కొట్టాడు.

భర్త రామ్‌ కుమార్‌ కొట్టడంతో భార్య శిరీష పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆ కోపంలో ఇద్దరు పిల్లలను బైక్‌ మీద తీసుకెళ్లిన రామ్‌ కుమార్‌ పిల్లల్ని వ్యవసాయ బావిలో పడేశాడు. కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. పిల్లల్ని చంపేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు వెతుకుతున్న క్రమంలో గుండ్రాతి మడుగు రైల్వే ట్రాక్‌పై శవమై తేలాడు రామ్‌ కుమార్‌. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు పోలీసులు.

కన్న కొడుకుపై తండ్రి లైంగిక దాడి

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

హై అలర్ట్.. తెలంగాణలో కరోనా కలకలం

Related Articles

Most Populer

Recent Posts