బిగ్‌బాస్ మొదటి సీజన్ హిట్ కావడంతో బిగ్‌బాస్ రెండో సీజన్ భారీ అంచనాల మధ్య మొదలైంది.న్యాచురల్ స్టార్ నాని యాంకర్‌గా వహిస్తున్న బిగ్‌బాస్ రెండో సీజన్‌పై మిశ్రమ స్పందన వస్తుంది.షోలోని సెలబ్రిటీస్ ఎవరు పెద్దగా ఫేమస్ కాకపోవడంతో షో పెద్దగా ఆకట్టుకోవడం లేదనే కామెంట్స్ వినిపించాయి.పైగా హోస్‌మెట్స్ మధ్య రోజు గొడవలు జనాలకు చిరాకు తెప్పిస్తున్నాయి.దీంతో షోని ఎలాగైనా మంచి రేటింగ్స్‌తో నడపలని భావిస్తున్నారు బిగ్‌బాస్ టీం.
దీనిలో భాగంగానే షోలోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ యువ హీరోయిన్‌ని తీసుకురాలని బిగ్‌బాస్ టీం ఆశిస్తుంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని ఎంట్రీ ఇచ్చింది.అయితే నందిని వల్ల షోకి పెద్దగా ఉపయోగం లేదు.ఆమె అందరిలాగే బిగ్‌బాస్ ఇంట్లో ఉంటుంది.బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో వైల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దీక్ష పంత్ బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నా వాళ్లతో పాటు.. చూసే జనాలకు చాలా ఎంటర్‌టైన్ చేసింది.ఇదే తరహాలో మరో హీరోయిన్‌ను బిగ్‌బాస్ టీంలోకి తీసుకురావలని చూస్తున్నారు.
కూమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన హీరోయిన్ హెబ్బా పటేల్‌ని బిగ్‌బాస్‌లోకి వైల్డ్‌కార్డు ద్వారా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఆమె ఓకే అందా లేదా అన్నది తెలియడం లేదు. తెరమీద చాలా బోల్డ్ గా కనిపించే హెబ్బా.. షోలోకి వస్తే కచ్చితంగా ఆకర్షణ పెరుగుతుందని.. యువతను ఆమె బాగా షో వైపు ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ వీకెండ్లో ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందంటున్నారు. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.