ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మొదటి పార్ట్ కథానాయకుడు సినిమా ఈ సంక్రాంతికి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘెరంగా ఫెయిల్ అయింది. సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఇప్పటికి కారణాలు తెలియడం లేదు. సినిమా చూసిన వారందరు బాగానే ఉందని చెప్పినప్పటికి కథానాయకుడు ఎందుకో తన సత్తాను చూపించలేకపోయింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టార్‌గా నిలిచింది. ఇక రెండో పార్ట్ విడుదల తేదీని ముందే ప్రకటించిన బాలయ్య,ఇప్పుడు ఆ డేట్‌కు సినిమాను విడుదల చేస్తారా? లేదా అనేది అనుమానంగా మారింది.
అయితే సినిమా మొత్తం మళ్లీ చూసుకున్న బాలయ్య కొన్ని మార్పులు చేస్తేనే బాగుంటుందని సలహా ఇచ్చినప్పటికి ,అప్పటికే చేయి దాటి పోయిదని క్రిష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి కథా నాయకుడు ప్రభావం మహనాయకుడు మీద ఖచ్చితంగా చూపిస్తుందని భావిస్తున్నాడు బాలయ్య. మహనాయకుడును ఫిబ్రవరి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.కథానాయకుడులో వచ్చిన తప్పులు రెండో పార్ట్ మహనాయకుడులో రాకూడదని ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు క్రిష్.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!