Saturday, May 3, 2025
- Advertisement -

షూటింగ్‌లో గాయపడ్డ హీరో కార్తీ!

- Advertisement -

దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీ. విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే సర్దార్ 2 సినిమా షూటింగ్ లో గాయపడ్డారు కార్తీ. ఆయన కాలికి గాయం కాగా మైసూరులో కీలకమైన యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే కార్తీని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.

వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కార్తీకి డాక్టర్లు సూచించగా పూర్తిగా కోలుకోవడానికి వారం రోజుల సమయం పడుతుందని చెప్పారట. ఈ ఘటనతో సర్దార్ 2 మూవీ షూటింగ్ ని నిలిపివేయగా హీరో కార్తీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించారు. సర్దార్ 2 డైరెక్టర్ పీఎస్ మిత్రన్. రజిశా విజయన్, ఎస్ జే సూర్య, మాళవిక మోహనన్, అషికా రంగనాథ్ ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -