Sunday, May 5, 2024
- Advertisement -

స‌ల్మాన్ ఖాన్‌పై ట్వీట్ చేసిన నాని

- Advertisement -

నాని ఏంటీ టైగ‌ర్‌కి హ‌లో చెప్ప‌డం ఏంటీ అనుకుంటున్నరా? ఏంలేదు అండీ మ‌న నాని బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌తో పోటీ ప‌డుతున్నాడు. నాని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మిడిల్ క్లాస్ అబ్బాయి డిసెంబ‌ర్ 21న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన టైగ‌ర్ జిందా హై చిత్రం డిసెంబ‌ర్ 22న విడుద‌ల అవుతుంది.అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌లో చిన్న సినిమాల సంద‌డి నెల‌కొన‌గా, ఇక డిసెంబ‌ర్ నుండి బ‌డా స్టార్స్ బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా క్రిస్మ‌స్, సంక్రాంతి పండుగుల‌ని కొందరు స్టార్ హీరోలు టార్గెట్ చేశారు.

విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ హీరోగా తెర‌కెక్కిన హ‌లో చిత్రం డిసెంబ‌ర్ 22కి రానుంది.ఈ క్ర‌మంలో కొంద‌రు నాని, అఖిల్ మ‌ధ్య బిగ్ ఫైట్ ఉంటుందా అని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ చేస్తున్నారు. దీనికి నాని చ‌మ‌త్కారంగా ట్వీట్ చేశాడు. మా ఇద్ద‌రి మ‌ధ్య పోటి ఉంద‌న‌డం అవాస్తవం. అంతకన్నా పోటీ స‌ల్మాన్‌కి, మాకు ఉంద‌ని అన్నాడు. క్రిస్మ‌స్‌కి మిడిల్ క్లాస్ అబ్బాయి .. టైగ‌ర్ జిందా హై చిత్రానికి హ‌లో చెబుతున్నాడు అని ట్వీట్ చేశాడు నాని.తెలుగ‌లో మంచి మార్కెట్ ఉన్న నాని ఓవ‌ర్‌సిస్‌లో కుడా మంచి రెస్పాన్స్ ఉంది.ఇత‌ను చేసిన సినిమాలు మంచి వ‌సూళ్లు సాధించాయి.మ‌రి స‌ల్మాన్ ముందు నాని ఏమాత్రం నిల‌బ‌డతాడో చుడాలి.

 

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -