Friday, May 17, 2024
- Advertisement -

మే14న హీరో నిఖిల్ పెళ్లి.. ఎక్కడంటే ?

- Advertisement -

ప్రస్తుతం మన టాలీవుడ్ లో వెడ్డింగ్ సిజన్ నడుస్తుంది. తమ పెళ్లి న్యూస్ ని ఒకరి తర్వాత ఒకరు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక హీరో రానా దగ్గుబాటి కూడా తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు. ఇరు కుటుంబాలు ఓకే అనడంతో రానా పెళ్లి కూడా త్వరలో కాబోతుంది.

ఇప్పుడు మరో యంగ్ హీరో పెళ్లి డేట్ ని అనౌన్స్ చేశాడు. యంగ్ హీరో నిఖిల్ పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే లాక్ డౌన్ ముగిసాక పెళ్లి చేసుకోవాలని అనుకున్న నిఖిల్ లాక్ డౌన్ ముగిసిన తర్వాత మూడాలు వస్తుండడంతో పెళ్లిని ఇంకా వాయిదా వెయొద్దని డిసైడ్ చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు చర్చించుకుని మే14న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.

రేపు ఉదయం 6 గంటల 31 నిమిషాలకు హైదరాబాద్ ఔట్ స్కట్స్ లో ఉన్న ఒక ప్రైవేటు విల్లాలో కేవలం కొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో నిఖిల్ పల్లవి వర్మని వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ తీసుకుని పెళ్ళికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు వాయిదా పడ్డా నిఖిల్ పెళ్లి.. ఎట్టకేలకు రేపు జరుగుతుందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పల్లవి వర్మ, నిఖిల్ కి ముందుగానే అడ్వాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -