Tuesday, April 30, 2024
- Advertisement -

మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కున్నహీరో రామ్‌…?

- Advertisement -

యంగ్ హీరో రామ్ ఓ మ‌ర్డ‌ర్ కేసులో ఇరుక్కున్నాడు. అయితే ఇది నిజ జీవితంలో కాదులేండి … త‌న కొత్త సినిమాలో హీరో రామ్ మ‌ర్డర్ కేసులో ఇరుక్కునే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే హీరో రామ్ వ‌రుస పెట్టి సినిమాల‌లో న‌టిస్తున్నాడు. హ‌లో గురు ప్రేమ కోస‌మే వంటి హిట్ సినిమా త‌రువాత రామ్ వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టాడు. రామ్ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను హీరోయిన్ ఛార్మీ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ సినిమాతోపాటు మ‌రో సినిమాను చేస్తున్నాడు రామ్‌. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన తాడమ్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప‌నిలో ప‌డ్డాడు రామ్‌. త‌మిళంలో ఈ సినిమాలో హీరోగా అరుణ్ విజయ్ న‌టించాడు.

ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా త‌మిళ బాక్సాఫీస్ వ‌ద్ద సినిమా ఘ‌న విజ‌యం సాధించడంతో , ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప‌నిలో ప‌డ్డాడు రామ్‌. ఓ మర్డ‌ర్ ఇన్విస్టిగేషన్‌కు సంబంధించి సినిమా మొత్తం సాగుతోంది. ఈ సినిమాను తెలుగు నేటివిటికి త‌గినట్లుగా మార్పులు చేసి తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నాడు రామ్‌. మ‌రి క్రైమ్ క‌థ‌తో వ‌స్తున్న రామ్‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -