- Advertisement -
ఉన్నది ఒకటే జిందగి’ లాంటి సినిమా తరువాత మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు రామ్. ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టిన త్రినాథరావు నక్కినతో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించాడు. హలో గురు ప్రేమకోసమే.. అంటూ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించేలా చేశారు చిత్రబృందం.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు. హీరోహీరోయిన్లపై ఒక రొమాంటిక్ సీన్ ను టీజర్ గా కట్ చేశారు. ఇంతకుముందు కంటే రామ్ ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ కూడా మరింత గ్లామర్ గా అనిపిస్తోంది. ఈ సినిమాలో ప్రణీత .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.