- Advertisement -

టాలీవుడ్ నిర్మాతలకు ఐటీ టెన్షన్‌!

- Advertisement -

తెలుగు సినీ నిర్మాతలపై రెండవ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఓ సినిమా ఫ్లాప్ అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ హిట్ అయిందా అంతే ఎంత లాభం వస్తుందో అంతే స్థాయిలో ఆ నిర్మాతలకు టెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఐటీ సోదాలు అంటేనే భయపడి పోతారు.

తాజాగా ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు అదే భయం పట్టుకుంది. వరుసగా రెండో రోజు దిల్ రాజు కు చెందిన SVC బ్యానర్ తో పాటు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్లను సైతం విచారిస్తున్నారు ఐటీ అధికారులు. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్ళు కార్యాలయాలపై సోదాలు కొనసాగుతున్నాయి. 55 బృందాలుగా ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా మెగా ప్రొడ్యూసర్ .. దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం .. నవీన్ ఎర్నెని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన ఆరతీస్తున్నారు ఐటీ అధికారులు. ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్ ను పరిశీలిస్తుండగా నిర్మాతల్లో టెన్షన్ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -