Friday, May 17, 2024
- Advertisement -

రెండు రోజుల్లో విడుదల పెట్టుకుని హాలిడే కి వెళ్లిన రామ్

- Advertisement -

ఈ మధ్యనే ‘హలో గురు ప్రేమకోసమే’ అనే సినిమాతో హిట్ అందుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేతులు కలిపి ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా జులై 18న విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది చిత్రబృందం. రామ్ మరియు హీరోహీరోయిన్లు నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ కూడా ప్రమోషన్లలో బాగానే పాల్గొంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ ప్రమోషన్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకొని ఒక హాలిడే కి వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమా ఇంకా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది అనుకున్న సమయంలో రామ్ ఇప్పుడు హాలిడే అంటూ అమెరికా వెళ్ళిపోయాడట. ఇప్పుడు ప్రమోషన్లు కాకుండా సినిమా విడుదలయ్యాక కూడా ప్రమోషన్లలో రామ్ పాల్గొనలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ బాధ్యతను తీసుకుని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారట. నిజానికి ఈ హాలిడే రామ్ ఇంతకుముందే ప్లాన్ చేసుకున్నారట. పైగా సినిమా కూడా వారం రోజులు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రామ్ ఇప్పుడు ఎంచక్కా హాలిడే కి వెళ్ళిపోయాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -