Thursday, April 25, 2024
- Advertisement -

సినిమా కోసం న‌గ్నంగా న‌టించిన సీనియ‌ర్ హీరో

- Advertisement -

`ఆప‌రేష‌న్ 2019` టీజ‌ర్ విడుద‌ల

మ‌హాత్మ సినిమా త‌ర్వాత హీరోగా సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్ ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ స‌క్ర‌మంగా ఆడ‌లేదు. ఆ సినిమా త‌ర్వాత ప‌లుకొన్ని సినిమాల్లో అతిథి పాత్ర‌లు చేశారు. అవి క్లిక్క‌య్యాయి. ఆయ‌న ఇంకా హీరోగా న‌టిస్తూ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఇప్పుడు సామాజిక అంశాల‌పై తీస్తున్న ఓ సినిమాలో ఒంటిపై నూలు పోగు లేకుండా న‌గ్నంగా న‌టించేశారు. సినిమా అంటే అంత పిచ్చి. సినిమా కోసం ఏదైనా చేసే వ్య‌క్తిత్వం శ్రీకాంత్‌. ఇప్పుడు తాను హీరోగా న‌టిస్తున్న చిత్రంలో న‌గ్నంగా క‌నిపించారు.

రాజ‌కీయాల నేప‌థ్యంలో `ఆప‌రేష‌న్ 2019` (బీవేర్ ఆఫ్ ప‌బ్లిక్) అనే సినిమా తీస్తున్నారు. అలివేలమ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో అలివేలు ఈ సినిమా నిర్మిస్తున్నారు. మెంట‌ల్ పోలీస్ ద‌ర్శ‌కుడు క‌ర‌ణం బాబ్జీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌, ఫ‌స్ట్‌లుక్‌లు గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌లో హీరో శ్రీకాంత్‌ను ఎంతోమంది క‌ర్ర‌ల‌తో దాడి చేస్తుంటారు. శ్రీకాంత్ న‌గ్నంగా ఉండి అచేత‌న స్థితిలో ర‌క్తం కారుతూ కోపంతో క‌నిపిస్తున్నాడు.

ఈ సినిమా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఉండ‌నుంది. అయితే ఆప‌రేష‌న్ దుర్యోధ‌న మాదిరి శ్రీకాంత్ విజ‌యం అందే అవ‌కాశం ఉంది. 2019 ఎన్నిక‌ల దృష్ట్యా ఈ సినిమా ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ స్టార్ హోదా పొందాడు. ప‌బ్లిక్ స్టార్ అనే కీర్తి పొందాడు.

https://www.youtube.com/watch?v=tr9i8f40S-s

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -