Wednesday, May 22, 2024
- Advertisement -

మెగావారమ్మాయి.. మరింత మంది హీరోల కన్ను!

- Advertisement -

దాదాపు రెండేళ్ల నుంచే నిహారిక సినీ ఆరంగేట్రం గురించి వార్తలు వస్తున్నాయి.

అయితే ఆమె హీరోయిన్ గా నటించడానికి చిరంజీవి ఒప్పుకోలేదని.. చరణ్ వద్దన్నాడని. .దీంతో నాగబాబు కు ఆసక్తి ఉన్నా వెనక్కు తగ్గాడని ప్రచారం జరిగింది. అయితే ఎలాగైతేనేం.. చివరకు నిహారిక సినిమాల్లోకి వచ్చేస్తోంది. నాగశౌర్యతో తొలి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఇప్పుడు తొలి సినిమాకు రెడీ అయిపోతున్న ఆమె పై ఇతర హీరోలు కూడా కన్నేసినట్టుగా ప్రచారం జరుగుతోంది!

ఆమెను తమ సరసన నటింపజేసుకోవడానికి కొంతమంది హీరోలు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. మెగా వారసురాలు కాబట్టి.. ఆమెను నటింపజేస్తే తమ సినిమాకు ప్లస్ అవుతుందని.. సినిమా కు మంచి ప్రచారం వస్తుందని ఆ హీరోలు లెక్కలేసుకొంటున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె కోసం సంప్రదిందపులు జరుపుతున్నారు. ప్రత్యేకించి హిట్స్ లో ఉన్న యువ హీరోలకు నిహారిక మీద కన్ను పడిందని సమాచారం.

అయితే తొలి సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ నిహారిక చేత మరిన్ని సినిమాల్లో నటింపజేస్తుందా? అనే అంశం ఇంక క్లారిటీ రావడం లేదు. అయినా ఒక సినిమాకు ఒప్పుకొన్నాకా.. మరిన్ని సినిమాలకు ఒప్పుకోకుండా పోతారా.. అనేది ఇండస్ట్రీ టాక్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -