Sunday, May 19, 2024
- Advertisement -

‘చచ్చిపోతా’నంటూ పోస్ట్‌ చేసిన మాధవీలత.. ఏమైంది ?

- Advertisement -

‘నచ్చావులే’ సినిమా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది మాధవీలత. అయితే హీరోయిన్ కంటే ముందు కొన్ని సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. తర్వాత హీరోయిన్ అయ్యాక కొన్ని సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది.

అయితే తాజాగా మాధవీలత తన ఫేస్ బుక్ పేజీలో చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేసి, కలకలం రేపింది. ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ఆమె మరోసారి దీనిపై స్పందించి వివరణ ఇచ్చింది. ‘డియర్ మీడియా మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు.. కానీ, నేను బాగానే ఉన్నాను.. ఉంటాను.. ఆ న్యూస్‌ని ప్రచారం చేయకండి. నా ఆరోగ్యం మాత్రమే బాగోలేదు.

నేను చేసిన పోస్టు అర్థం ఏంటంటే… మెడిసిన్స్ వాడితే జీవితకాలం తగ్గుతుంది. నాకు మెడిసిన్స్ మీద విరక్తి వచ్చి అలా చెప్పాను. రిలాక్స్‌ కండి.. ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను జస్ట్ క్యాజువల్ గా నా ఆరోగ్య సమస్యలు తెలుపుతూ ఆ పోస్టు చేశాను. నా మైగ్రేన్ సమస్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను’ అని ఆమె వివరణ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -