టాలీవుడ్ స్టార్ హీరోయిన్ , అక్కినేని ఇంటి కోడలు సమంతపై కొద్ది రోజులు నుంచి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సమంత తమిళ రాజకీయాలోకి ఎంట్రీ ఇవ్వనుందని కొన్ని రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో ఓ వైరల్‌గా మారింది. అయితే ఇది రియల్ పొలిటిక్స్‌లోకి కాదండి..రీల్ పొలిటిక్స్. సమంతను హీరోయిన్‌గా పెట్టి తమిళంలో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రసాద్ దీనదయాళ్ అనే దర్శకుడు ‘తుగ్లక్ దర్బార్ అనే పేరుతో ఓ సినిమాను తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ ఫాంటసీగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో సమంత ఓ పొలిటిషియన్‌గా కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో సమంత సరసన హీరోగా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్ నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. సమంత ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తుంది. భర్త నాగచైతన్యతో కలిసి మజిలి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు తమిళంలో ఘన విజయం సాధించిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తుండగా, హీరోయిన్‌గా సమంత నటిస్తుంది.
- Advertisement -
తమిళ రాజకీయల్లోకి సమంత.. ఆ పార్టీ నుంచేనా?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -