Monday, May 6, 2024
- Advertisement -

పెళ్లి చేసుకుని ఒక‌రితోనే ఉండాలా? – హీరోయిన్

- Advertisement -

త‌మిళ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురు వ‌ర‌ల‌క్ష్మీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.వ‌ర‌ల‌క్ష్మీ హీరోయిన్ కాక‌ముందే నుంచే బాగా ఫేమ‌స్ అయింది.హీరో విశాల్‌తో ఈ భామ ప్రేమ‌లో ఉంద‌ని చాలానే వార్త‌లు వ‌చ్చాయి.అయితే అలాంటిది ఏమి లేద‌ని,మేము జ‌స్ట్ ఫ్రెండ్స్ మాత్ర‌మేన‌ని తెలిపింది.ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఇప్పుడిప్పుడే మంచి ఛాన్సులు కొట్టేస్తుంది వ‌ర‌ల‌క్ష్మీ.విశాల్‌తో పందెం కోడి-2,విజ‌య్‌తో స‌ర్కార్ సినిమాలలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది.తాజాగా ఈ భామ ఓ ఇంట‌ర్య్వూలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది.

పెళ్లి చేసుకుంటే రోజు వాడి ముఖాన్నిచూడాలి. ఎవరికోసం చూడాలి..? ఇందుకోసం చూడాలి..?. ప్రేమను పంచడంలో తప్పులేదు కానీ దాన్ని పెళ్లితో ముడిపెట్టడం కరెక్ట్ కాదు.ఒక వ్యక్తిపై మహిళలు ఆధారపడకూదదనేది నా అభిప్రాయం. నాకు ప్రేమ వస్తుంటుంది, పోతూంటుంది. నాకు కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. వాటితో నేను డీల్ చేస్తున్నా.. ఇప్పుడు వేరే వ్యక్తి నా లైఫ్ లోకి వస్తే నా కారణంగా వారు ఇబ్బంది పడొచ్చు. అలా అని నేను పెళ్లికి వ్య‌తిరేకిని కాన‌ని తెలిపింది వ‌ర‌లక్ష్మీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -