ప్రభాస్ భూవివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శేర్‌లింగంపల్లిలోని ప్రభుత్వ స్థలంలో ప్రభాస్ గెస్ట్ హోస్ ఉందని , రెవెన్యూ అధికారులు ప్రభాస్ గెస్ట్ హోస్‌ను సీజ్ చేశారు. ప్రభుత్వం స్థలం 80 గజాలలో ఆయన గెస్ట్ హోస్ కట్టారని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ప్రభాస్. తన పక్కా ఆధారలతో స్థలం కొనుగోలు చేశానని,నా పేరు మీద రెవెన్యూ అధికారులే రిజిస్టార్ చేశారని ప్రభాస్ తరుపున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు ఇప్పటికి ఈ కేసును రెండు సార్లు వాయిదా వేసింది. తాజాగా మరోసారి ప్రభాస్ కేసును వాయిదా వేసింది హైకోర్టు. ఈ సందర్బంగా ప్రభాస్‌పై కొన్ని ఆసక్తిరమైన కామెంట్స్ చేసింది హైకోర్టు.
మీరు సినిమాలలో బాహుబలి అయి ఉండవచ్చు కాని , చట్టం ముందు కాదని,మీకు అనుకులంగా తీర్పు ఇస్తే ఆ స్థలం దగ్గర మరికొంత మంది కబ్జా చేసే అవకాశం ఉందని , కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. ఈ కేసులో పూర్తి వివరాలు తెలిసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పింది.
దీనిని బట్టి చూస్తే ప్రభాస్ గెస్ట్ హోస్ అతనికి దక్కే అవకాశాలు చాలా తక్కువుగా కనిపిస్తున్నాయి.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!