Saturday, May 4, 2024
- Advertisement -

హాలీవుడ్ కి వెళ్తున్న పవన్ హీరోయిన్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన పులి సినిమా తో తెరంగేట్రం చేసింది నికీషా పటేల్. ఈ సినిమా లో ఈ హీరోయిన్ చేసిన పాత్ర అందరినీ ఎంతగానో మెప్పించింది. అయితే ఆ తర్వాత నికీషా పటేల్ కి పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ ఏదో ఒక సినిమా లో ఏదో ఒక పాత్ర చేస్తూ అప్పుడప్పుడు మీడియా లో కనిపిస్తూ నికీషా తన ప్రెజన్స్ ని ఎప్పటికప్పుడు చూపెడుతూ వస్తుంది. అయితే తాజాగా నికీషా పటేల్ ఇప్పుడు హాలీవుడ్ లో అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తుంది. ఒక యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ డ్రామా స్కూల్ మేనేజ్మెంట్ కి సంబందించిన ఒక ప్రాజెక్ట్ లో నికీషా ఒక పాత్ర దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా లో నికీషా ఎలాంటి పాత్ర చేస్తుంది అనే విషయం ఇప్పటి వరకు తెలియదు కానీ నికీషా మాత్ర ఈ పాత్ర పోషించడానికి మంచి ఆసక్తి ని కనబరుస్తుంది. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ, “ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఉత్సుకుత తో ఎదురు చూస్తున్నాను. షెల్లీ నార్థన్ ఏజెన్సీ కి ధన్యవాదాలు” అని ఆమె ట్విట్టర్ లో పేర్కొంది.

అయితే ప్రస్తుతం సినిమాల పరం గా నికీషా పటేల్ ఒక తమిళ సినిమా చేస్తుంది. జీ వీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్ర లో వస్తున్న మార్కెట్ రాజా ఎంబీబీస్ లో ఆమె నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -