Friday, May 3, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ కోసం హాలీవుడ్ నిపుణుడు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని దూసుకుపోతున్న నటుల్లో ఒకరు విజయ్ దేవరకొండ. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు తన కెరీర్ ని ఎంతో జాగ్రత్త గా ప్లాన్ చేసుకున్న విజయ్ ఆచి తూచి అడుగులు వేస్తూ ఉండడం విశేషం. అయితే ఈ హీరో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా విడుదల పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. అదే విధం గా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో కూడా ఒక కొత్త చిత్రం షూటింగ్ పని లో నిమగ్నమై ఉన్నాడు.

విజయ్ నోటా సినిమా తో తమిళ ప్రజలకు చేరువయ్యాడు. ఇప్పుడు మరొక బై లింగ్వల్ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు విజయ్. హీరో అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం లో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేసారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా లో ఒక యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి దాదాపుగా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టనున్నారట. అందుకోసం స్పెషల్ గా హాలీవుడ్ నుండి ఒక ఎక్స్పర్ట్ ని సినిమా కోసం తీసుకోనున్నారట.

దాదాపు 40 పైగా కోట్ల తో ఈ సినిమా తెరకెక్కనుంది అని టాక్. విజయ్ సినిమా కి హాలీవుడ్ టెక్నీషియన్ పని చెయ్యడం కూడా ఇదే మొదటి సారి కావడం తో అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -