Thursday, May 16, 2024
- Advertisement -

విడాకులు తీసుకొన్న హీరో.. యంగ్ హీరోయిన్.. వీళ్ల బంధం ఏమిటో!

- Advertisement -

ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు హృతిక్ రోషన్. కొన్ని సంవత్సరాలు బార్యతో చక్కగా కాపురం చేసుకొని.. పిల్లలు కూడా కలిగాకా హృతిక్ పెళ్లి పెటాకులు అయ్యింది. భార్యతో విడాకులు తీసుకొన్నాడు. ప్రస్తుతానికి ఈ హీరో సింగిల్ గా ఉన్నాడు. మరి మోస్ట్ డిజైరబుల్ మెన్ లో ఒకడైన హృతిక్ ఖాళీగా ఉంటే అమ్మాయిలు ఊరికే ఉంటారా!

ఇప్పుడు హృతిక్ రొమాంటిక్ లైఫ్ గురించి కొత్త పుకార్లు మొదలయ్యాయి. ఇతడు ఒక హీరోయిన్ తో అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ వైపు వెళ్లిన దక్షిణాది నటీమణి పూజా హెగ్డేతో హృతిక్ ప్రేమయాణాన్ని సాగిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. హృతిక్ సింగిల్ గా ఉండటం ఈ  పుకార్లకు మరింత ఊతం ఇస్తోంది.

ఇక పూజా కూడా కాస్త సోషల్ గానే ఉంటుంది. దీంతో అనేక అనుమానాలు రేగుతున్నాయి. పుకార్ల సంగతి అలా ఉంటే..ఈ హీరో, హీరోయిన్లు ఇద్దరూ తమ  ప్రేమవార్తలను ఖండిస్తున్నారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. తాము కలిసి పనిచేయడం వల్లనే ఇలాంటి పుకార్లు పుట్టిఉండవచ్చని వారు రూమర్లను కొట్టి పడేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -