- Advertisement -
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే వేసవికి విడుదల చేయడానికి ప్రయత్నలు చేస్తున్నారు చిత్ర యూనిట్.ఈ సినిమా తరువాత మహేశ్ బాబు సుకుమార్ దర్శకత్వంలో తన 26వ సినిమా చేయనున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
రంగస్థలం సినిమా హిట్‌తో మంచి జోషలో ఉన్న సుకుమార్ మహేశ్ కోసం మంచి కథను సిద్దం చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కథ ప్రకారం సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. అందుకే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టబోతున్నారట.