అల్లు శిరీష్, పూజా హెగ్డెలు ఓ స్కామ్‌లో ఇరుకున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ ‘క్యూనెట్’కేసులో సైబరాబాద్ పోలీసులు వీరికి నోటీసులు పంపించారు.క్యూనెట్ ఫ్రాంచైజీ విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై నమోదైన 14 కేసుల్లో దాదాపు 60 మందిని అరెస్టు చేశారు. వీరిలో పలువురు సినీ ప్రముఖులతో పాటు, ప్రముఖ క్రికెటర్లు కూడా ఉన్నారు.బొమన్ ఇరానీ, షారుక్ ఖాన్ ఈ కేసులో నోటీసులు అందుకున్నారు. ఈ కేసులో దాదాపు 500 మంది క్రికెటర్లు కూడా ఉన్నారని సమాచారం.
నోటీసులు అందుకున్న వారంత గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. వీరి ఇచ్చే సమాధానాలు బట్టి తదుపరి చర్యలు ఉంటాయాని పోలీసులు తెలిపారు. బెంగళూరుకు చెందిన విహన్ డైరెక్ట్ సెలింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 3 లక్షల మందిని మోసగించినట్లుగా తెలుస్తోందన్నారు.ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకుపైగా మోసం చేసినట్లు గుర్తించామన్నారు. దర్యాప్తు పూర్తయితే తప్ప ఎంత మందిని, ఎంత మొత్తంలో మోసం చేశారన్నదానిపై స్పష్టత వస్తుందన్నారు.
- Advertisement -
స్కామ్‌లో ఇరుకున్న’అల్లు శిరీష్, పూజా’ ..నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -