Monday, May 13, 2024
- Advertisement -

హీరోని అవ‌మానించిన అను

- Advertisement -

గోపిచంద్‌ని ఘోరంగా అవ‌మానించిన అను ఇమ్మాన్యుయేల్. సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌న క‌థానాయిక‌ల‌ మాటా మంతీ చాలా వింత‌గా ఉంటుంది. కొన్నిసార్లు నిజాల్ని క‌ప్పి పుచ్చుతూ అబద్ధాలు చెప్పేందుకు వెన‌కాడ‌రు. ముఖ్యంగా త‌మ ద‌ర్శ‌కుడు, హీరో, నిర్మాత‌ల గురించి ఎంతో ఆచితూచి మాట్లాడుతూ ఏమాత్రం దొర‌క‌రు. ఇక్క‌డ మాత్రం సీన్ వేరేగా ఉంది. న‌వ‌త‌రం క‌థానాయిక అనూ ఇమ్మాన్యుయేల్ ఉన్న మాట‌ను సూటిగా అనేసి అంద‌రికీ షాకిచ్చింది.

అనూ ఇమ్మాన్యుయేల్ గోపిచంద్ జంట‌గా ఆక్సిజ‌న్ మూవీలో క‌లిసి న‌టీంచారు.ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగాంగా ఓ ప్రోగ్రంలో పోల్గోన్న అనూ ఇమ్మాన్యుయేల్ నేనింత‌వ‌ర‌కూ హీరో గోపిచంద్ న‌టించిన సినిమాలేవీ చూడ‌లేదు.. అని ఓపెన్‌గా చెప్పేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఓపెన్‌గా మాట్లాడిన ఏకైక అంద‌గ‌త్తె అనూ మాత్ర‌మే అని ప్ర‌శంసించాల్సిందే. ఫిల్మీ వ‌ర‌ల్డ్‌లో ఇలా ఉన్న మాట ఓపెన్‌గా చెప్పేస్తే కుద‌ర‌దు. అవ‌త‌లి వాళ్లు ఫీలైతే కొంప‌లంటుకుంటాయి. కానీ అలాంటి భ‌యాలేవీ లేకుండా యువ‌త‌రం నాయిక చాలా ఈజీగానే అనేసిందిలా. అయితే గోపిచంద్, త‌న డైరెక్ట‌ర్ జ్యోతికృష్ణ ఇద్ద‌రూ చాలా కూల్ గ‌య్స్ అంటూ కితాబిచ్చింది అనూ.

https://www.youtube.com/watch?v=GuaFJ65necU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -