Friday, March 29, 2024
- Advertisement -

ఆ ప‌ని చేస్తేనే సినిమా అవ‌కాశాలంటున్న ఆండ్రియా..

- Advertisement -

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి పెను దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో శ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఎంత‌టి ప్ర‌కంప‌న‌లు రేపింది. ఇండ‌స్ట్రీలో ఆప‌ని చేస్తేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయంటోంది కోలీవుడ్ నటి ఆండ్రియా. ఎంత ఎక్కువ అందాలు ఆర‌బోస్తె అన్ని సినిమా అవ‌కాశాలు వ‌స్తాయంటోంది.

సినీ పరిశ్రమకు వచ్చే యువతులు నటన, భాష, మంచి వాచకం ఉంటే అవకాశాలు వస్తాయని భావిస్తారని, కానీ వాస్తవానికి ఇక్కడ అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఎక్కువని తెలిపింది. ప్రస్తుతం గ్లామర్‌ కి అర్థం మార్చేస్తున్నారని, అవసరం ఉన్నా లేకపోయినా బికినీలు వేయడం, సీన్‌ డిమాండ్‌ చేస్తోందనీ, అరకొరా దుస్తులు వేసుకోవడం, లిప్‌ లాక్‌ సీన్స్ పెట్టడమే గ్లామర్ గా పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

హీరోయిన్లను కేవలం అందాల బొమ్మలుగానే చూపిస్తున్నారని, వారి నటనను చూపించడం లేదని తెలిపింది. దీంతో చాలా మంది రాజీ పడిపోతున్నారని చెప్పింది. అందుకే చిత్రపరిశ్రమలో స్టార్ హీరోలే తప్ప స్టార్ హీరోయిన్ లు ఉండడం లేదని పేర్కొంది. కోలీవుడ్ లో నయనతార ఒక్కరే స్టార్ హీరోయిన్ అని ఆండ్రియా తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -