Thursday, May 16, 2024
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ కథ.. అదే నిజమైతే లాజిక్స్ అటకెక్కినట్టే

- Advertisement -

పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా కథ పై మీడియా లో చాలా రిపోర్ట్స్ తిరుగుతున్నాయి. ఈ కథ తెలుగు సినిమా పరిశ్రమ లో చాలా మంది ని ఆశ్చర్య పరిచేలా ఉంటుంది అని తెలుస్తుంది. అయితే పూరి జగన్ ఈ సారి సినిమా లో కొన్ని ఆసక్తికరమైన అంశాలని యాడ్ చేసాడట. సినిమా లో రామ్ కి బ్రెయిన్ లో ఒక చిప్ ని పెడతారట. అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరం గా మారనుంది. ఈ సినిమా లో ముందు నుండి చాలా హైపర్ గా కనిపిస్తాడు రామ్. ఇక బ్రెయిన్ లో ఆ చిప్ పెట్టడం తో ఎలా మారతాడు అనేది చాలా కొత్త పరిస్థితులకి దారి తీస్తుంది అని తెలుస్తుంది.

ఇకపోతే ఇదే నిజం గా సినిమా లో కథ అయితే మాత్రం లాజిక్స్ అన్నీ అటకెక్కినట్టే. పూరి జగన్ సినిమాల్లో సాధారణం గా పెద్దగా లాజిక్స్ ఉండవు కానీ ఇది నెక్స్ట్ లెవెల్ లా గా అనిపిస్తుంది. కాకపోతే ఎంత వరకు ఈ కథ తో మనల్ని మెప్పిస్తారు అనేది మనం వేచి చూడాలి. నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ ఈ సినిమా లో హీరోయిన్లు గా చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -