Friday, May 17, 2024
- Advertisement -

ట్రైలర్ రివ్యూ: ఇస్మార్ట్ శంకర్

- Advertisement -

ఇప్పటికే సినిమా టీజర్ తో ఇస్మార్ట్ శనకర్ సినిమా పైన అంచనాలని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు సినిమా ట్రైలర్ తో మన ముందుకు వచ్చారు. ఇందులో హీరో గా చేసిన రామ్ తన క్యారెక్టర్ తో అందరినీ ఎంతగానో ఆకర్షించాడు. ఒక రా, నాచురల్ హైదరాబాదీ యాటిట్యూడ్ ని హీరో కి బాగా నే తగిలించారు దర్శకులు పూరి. ఈ సినిమా అటు దర్శకుడు పూరి కి, ఇటు హీరో రామ్ కి తప్పకుండా విజయం సాధించాల్సిన సినిమా కావడం తో సహజం గానే సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ట్రైలర్ కట్ ఆకర్షణీయం గా చేశారు. సినిమా లో ఉన్న బోల్డ్ నెస్ ని, హీరో పాత్ర ని హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. ఇంకా సినిమా లో విజువల్స్ అదిరిపోయాయి అని చెప్పుకోవచ్చు. ముందు నుండి సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది అనే ధీమా తో ఉన్న దర్శక నిర్మాతలు ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ బట్టి సినిమా మీద ఒక అంచనా కి వచ్చేస్తారు. రామ్ మెదడు లో కి సిం కార్డు చిప్ పెట్టడం అనే అంశం కాస్త ఆసక్తికరం గా ఉంది. అదే విషయాన్నీ ట్రైలర్ లో కూడా చూపడం బాగుంది.

ఈ సినిమా లో హీరోయిన్లు గా నభ నటేష్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18 న విడుదల అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -