Friday, May 17, 2024
- Advertisement -

రొమాంటిక్ ట్రైలర్ తో వచ్చిన ఇస్మార్ట్ శంకర్

- Advertisement -

ఈమధ్యనే ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో రామ్ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిధి అగర్వాల్ మరియు నభ నటేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈమధ్యనే విడుదలైన చిత్ర ట్రైలర్ లో తన మాస్ అప్పీరన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు రామ్. ఇప్పుడు రెండవ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. మొదటి ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలు ఉండగా, రెండవ ట్రైలర్ మొత్తం రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.

మొదటి ట్రైలర్ కంటే రెండవ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఈ ట్రైలర్ చూస్తే రఫ్ అండ్ మాస్ అవతారం లో దర్శమనిచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని తెలుస్తోంది. నభ నటేష్ మరియు నిద్ది అగర్వాల్ తో రామ్ సన్నివేశాలు ఈ ట్రైలర్ లో చూడచ్చు. పూర్తి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్స్ పతాకాల పై పూరి జగన్నాధ్ మరియు చార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 18 న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో రామ్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -