అఖిల్ చిత్రం ఆడియో లాంచ్ కు ముందునుంచి ఇద్దరు టాప్ హీరోలు వస్తారని ప్రచారం జరిగింది.
వారిలో ఒకరు పవన్ ,మరొకరు మహేష్ . చివరకు ఈవెంట్ కు మహేష్ మాత్రమే వచ్చాడు. పవన్ తాను రానని నితిన్ ను లైట్ తీసుకోమన్నాడట. కాని పవన్ లైట్ తీసుకోమని చెప్పడం కూడా ఒక విధంగా మంచిదైందని పవర్ స్టార్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే…. వన్ ఆఫ్ ది టాప్ స్టార్ కంటిన్యూ అవుతోన్న మహేష్ ను ముందు పెట్టుకుని మరీ…అఖిలే… ఫ్యూచర్ స్టార్ ,ఇతనే అందగాడు ,ఇతనే మన మన్మధుడు అని చెప్పడం మహేష్ ఫ్యాన్స్ ను నొచ్చుకునేలా చేసింది. ఎందుకంటే ఆవిషయంలో ఇంకో పదేళ్లపాటు ప్రిన్స్ ను కొట్టేవారు లేరు.
ఒక వేల ఇదే ఈవెంట్ కు పవన్ కూడా వస్తే….అతని ముందు కూడా ఇలాంటి కబుర్లే చెబితే…అతను ఊరుకున్నా…అతని ఫ్యాన్స్ ఊరుకునేవారు కాదు. సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేసేవారు.. అందుకే ఆ యాంగిల్లో చూసినపుడు అఖిల్ ఆడియో లాంచ్ కు పవన్ వెళ్లకపోవడం మంచిదైందని సోషల్ మీడియాలో కామెంట్లు పడిపోతున్నాయి.