Wednesday, May 7, 2025
- Advertisement -

“గబ్బర్ సింగ్-2” కాదు.. పవన్ సినిమా టైటిల్ మారింది!

- Advertisement -

చాలా నెలలుగా ప్రతిపాదనలో ఉండి.. ఎట్టకేలకూ రెగ్యులర్ షూటింగ్ తో పట్టాలెక్కిన పవన్ కల్యాన్ సినిమా ‘గబ్బర్ సింగ్-2’ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా టైటిట్ మారిందని తెలుస్తోంది.

సూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గావస్తుందనే ప్రచారం పొందిన ఈ సినిమా టైటిల్ ‘గబ్బర్ సింగ్-2’ కాదు అనేది అయితే స్పస్టం అవుతుతోంది. దీనికి కొత్తగా ‘సర్ధార్” అని నామకరణం చేసినట్టుగా తెలుస్తోంది.

రవితేజతో ‘పవర్’ వంటి సినిమాను రూపొందించిన దర్శకుడు బాబీ పవన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాణ్ స్వయంగా ఈ సినిమాకు కథ, కథనాలను సమకూరచినట్టుగా వార్తలున్నాయి. ఈ సినిమా ప్రొడక్షన్ లో కూడా పవన్ కు వాటా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఏ విధంగా చూసినా ఈ సినిమా పవర్ స్టార్ అభిమానుల్లో బీభత్సమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న సబ్జెక్టే.

మరి ఇప్పుడు దీనికి పెడుతున్న ‘సర్ధార్’ అనే టైటిల్ కూడా పవర్ ఫుల్ గానే ఉంది. అభిమానుల అంచనాలను అందుకొనేలానే ఉంది! టైటిల్ విషయంలో మాత్రం  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -